హెచ్చరిక:నేను రాసే ప్రతి టపా కి ఒక హెచ్చరిక ఉంటుంది. అందుకనే "హెచ్చరిక " అని మొదలుపెట్టాను. కాని, విషయమేంటంటె ఇందులో హెచ్చరించటానికి ఏమి లేదు. పొద్దుపోక రాస్తున్నాను.. అంతే.
మొన్నామధ్య టీవీలో ప్రముఖ రాజకీయవేత్త,బహుభాషాకోవిధుడు అయిన నందమూరి తారకరత్న(ఎవరో తెలుసుగా?) ఇంటర్వ్యూ వచ్చింది. అందులో వ్యాఖ్యాత అడిగే ప్రశ్నలకి వీడి తలతిక్క సమాధానాలు విని ఆత్మహత్యకు సులువైన మార్గం ఏమిటి అనే ఆలోచన వచ్చింది. నాకెలాగూ ప్రాక్తికల్ గా చేసుకొనే ధైర్యం లేదు కాబట్టి ఆ విషయంలో రెగులర్ గా ప్రాక్టీస్ చేసే, ఇప్పటికే రెండుమూడుసార్లు ట్రై చేసిన మా నరేష్ గాడితో ఒకసారి మాట్లాడటానికి నిర్ణయించుకున్నాను. నరేష్ గాడి విషయం వచ్చింది కాబట్టి వాడు ఎందుకు సూసైడ్ కి ట్రై చేసాడో తెలుసుకుందాం. ఎలా చేశాడు అనేది నాకు కూడా తెలియని రహస్యం.
మొదటి ప్రయత్నం : మా నరేష్ గాడు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మిస్స్డ్ కాల్ ఇస్తాడు. కొంచెం అర్జెంట్ అయితే రెండు సార్లు మిస్స్డ్ కాల్ ఇస్తాడు. ఇక మరీ ముఖ్యమైన విషయమైతే ఎదుటివాళ్లు కాల్ చేసేవరకు మిస్స్డ్ కాల్స్ ఇస్తూనే ఉంటాడు. అలాంటిది ఒకసారి వాడు నాకు కాల్ చేసినపుడు పొరపాటున లిఫ్ట్ చేసేసా. అంతే, మా వాడి గుండె పగిలిపోయింది. కోపం,బాధ , ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలీక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
రెండో ప్రయత్నం : మా బీటెక్ లొ కోమల అనే ఒక కసక్కు ఉండేది.( ఒరేయ్.. తప్పురా. లెక్చరర్ ని కత్తి.. కసక్కు .. అనకూడదు) ఆమెను చూసి మా నరేష్ గాడు మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమె పాఠం చెప్తుంటే మా వాడు ఎప్పుడు 45 deg యాంగిల్ లోకూర్చుని లైన్ వేసేవాడు( ఎందుకలా ... అని అడక్కండి. అదంతే ). అలా కొంతకాలం గడిచాక ఇక ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యి, మదనపల్లె పెద్ద మసీద్ దగ్గర కొన్న అత్తరు పూసుకొని శివాలయం స్వామి దగ్గర 5:45కి ముహుర్తం పెట్టించుకుని సైకిల్ లో కోమల ఇంటికి బయల్దేరాడు. కాని, దారిలో కోమల రజనిల్ రాజ్ అనే గొట్టం గాడి చేతిలో చెయ్యివేసి వెళ్లటం చూసి( లెక్చరర్ ని గొట్టం అనటం కూడా తప్పే ) నరేష్ గాడి గుండె మళ్ళీ పగిలింది. పక్కనే ఉన్న పంక్చర్ షాప్ లో గుండెకి ఒక పాచ్ వేయించుకుని, సైకిల్ని హాఫ్ రేట్ కి అమ్మేసి మా వాడు అస్తమిస్తున్నసూర్యుడి వైపు అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే నరేష్ గాడి జీవితం లో ఎన్నో విషాదగాథలు మరెన్నో గుండెల్ని పిండేసే సందర్భాలు. ఇలా జరిగిన ప్రతీసారి మా వాడు సూసైడ్ కి ట్రై చెయ్యటం అది మిస్సవ్వటం మామూలే. కాకపొతే ఈ విషయంలో నేనైనా సక్సస్ అవుతానేమొ చూద్దామని ఎలా ట్రై చేస్తున్నాడో తెలుసుకోవటానికి నేనే వాడికి కాల్ చేశాను(" నేనే వాడికి కాల్చేశాను "... ఇది ఒత్తి పలకండి).
ట్రింగ్... ట్రింగ్...
హలో !! రేయ్ రవిగా ఎలా ఉన్నావ్?
నీయబ్బ.. నేను రా భరత్ ని.
ఓహ్.. నువ్వా. ఇందాక రవిగాడికి మిస్డ్ కాల్ ఇచ్చా ... వాడేనేమొ అనుకున్నా.
!@$%$% .. సర్లే కాని, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా.
ఓహ్.. కంగ్రాట్స్. ఎన్నోసారి?
నీ.... నేను నీలాగ కాదురా.
సరే ..సరే.. అలా ఐతే నువ్వు " ఆత్మహత్యకు అరవై దారులు" అనే పుస్తకం చదువు. నేను కూడా అందులో ఉన్నవే ట్రై చేస్తుంటా.
అందుకేనా ఇంకా ఉన్నావు.
అలా కాదురా.. నాకు పనిచెయ్యలేదు నీకు పని చేస్తుందేమో చూడు.
సరేలే ... నేను ట్రై చేస్తా.
గుడ్... అలాగే నీకు ఏ దారి పనిచేసిందో నాకు కాల్ చేసి చెప్పు.
ఒరేయ్ !@$%$%... పెట్రా ఫోను.
సరే.. ఇక పుస్తకం పేరు తెలిసింది కాబట్టి,అందులో ఏముందో తెలుసుకుందామని అది కొనటానికి బెంగుళూరు లో సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు దొరికే అవెన్యూ రోడ్ కి వెళ్లా. ఒక షాప్ కి వెళ్లి అడిగా..
బాబు!! " ఆత్మహత్యకు అరవై దారులు" అనే పుస్తకం ఉందా ?
మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరా?
?????????
అంటే.. ఈ మధ్య వాళ్లే ఈ పుస్తకాన్ని ఎక్కువగా అడుగుతున్నారు.అందుకే అడిగాను . ఇదిగోండి పుస్తకం.
ఛీ! ఎదవ బతుకు అని మనసులో అనుకుని, నేనేం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని కాదు. ఇంతకీ ఈ పుస్తకంలో ఉన్న దారులు పనిచేస్తాయా? ఏదైనా ఫీడ్ బ్యాక్ చూసి కొనటం నాకు అలవాటు. సక్సస్ ఫుల్ గా సూసైడ్ చేసుకున్నవాళ్లు ఎవరైనా ఇందులో ఫీడ్ బ్యాక్ ఇచ్చారా? అని అడిగా.
వాడు నా వైపు విచిత్రంగా చూసి వెకిళిగా నవ్వాడు.( "ఒరేయ్ తింగరోడా!! సక్సస్ ఫుల్ గా సూసైడ్ చేసుకున్నవాళ్లు ఫీడ్ బ్యాక్ ఎలా ఇస్తార్రా?" అన్న భావం వాడి నవ్వులో కనిపించింది ) నిజం చెప్పండి సార్ మీరు సాఫ్ట్ వేర్ ఇంజనీరే కదా? అని మళ్లీ అడిగాడు.
ఇక దాచటం కష్టమనిపించి, " అవును" అని చెప్పి పుస్తకం లాక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను.
ఇంతకీ.. ఆ పుస్తకంలో ఏముంది? ప్చ్.. ఏమో ఇపుడు చదివే ఓపిక నాకు లేదు. అది తీరిగ్గా చదివి నెక్స్ట్ టపాలో చెప్తా. అంతవరకు సెలవు. మరచిపోయా.. నరేష్ గాడు పార్టీకి పిలిచాడు, వాడి గురించి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు.
Jan 22, 2009
Subscribe to:
Posts (Atom)